నటుడిగా నాకు ఆనందం లేదు….

598
- Advertisement -

పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నది కేవలం అభిమానుల కోసమేనా? అంటే ఆయన మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది.  అనంతపురంలోని  నిర్వహించిన చైతన్యసభలో పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి అర్థం వచ్చేలానే వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి ఈ సభ ద్వారా పవన్ కొత్త గెటప్‌లో కనిపించారు. నేవీ బ్లూ కలర్‌ కుర్తాపైజమా ధరించి వేదికపైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మధ్య.. మధ్యలో కళ్లద్దాలు పెట్టుకున్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వివరాల ప్రతులు చదివీ.. చదివీ తనకు సైటొచ్చిందని చమత్కరించి అందరినీ నవ్వించారు. ఇదే సమయంలో నటుడిగా తనకు ఆనందం లేదని పవన్ చెప్పుకొచ్చాడు. దీనికి కారణం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నానని పవన్ భావిస్తుండడమేనట.సినిమాలు పూర్తిగా మానేద్దామని అనుకున్నా.. ఫ్యాన్స్ కోరికను కాదనలేక పవన్ నటుడిగా కొనసాగుతున్నారు. అందుకే.. పవన్ ఈ విధంగా వ్యాఖ్యలు  చేసినట్లు తెలుస్తోంది. ఇక తనకు ప్రజా  సమస్యలపై పోరాడినప్పుడు, ప్రజలకు అండగా నిలబడినప్పుడే ఆనందం కలుగుతుంది అని పవన్ చెప్పారు.  ఈ మాటల బట్టి చూస్తే పవన్ సినిమాల్లో ఇంకా ఎంతోకాలం కొనసాగపోవచ్చని అంటున్నారు. మరీ ఇందులో ఏది నిజమో తెలియాలంటే  ఇంకా కొన్నాళ్లు వెయిట్ చెయ్యక తప్పదు.

pawan kalyan

- Advertisement -