ఎంతైనా ఇస్తా.. తీసేయండి ప్లీజ్‌ !

260
Surekha Vani's hot dance
Surekha Vani's hot dance
- Advertisement -

ఒకప్పటి బుల్లితెర యాంకర్.. ఇప్పుటి వెండితెర బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తెగ బాధపడిపోతుంది. ఇంతకీ ఆమెకు ఏమైందని అనుకుంటున్నారా? ఆ మధ్య సురేఖా, కూతురుతో కలిసి కురుచ దస్తుల్లో ఓ హిందీ పాటకి మస్తు మస్తుగా డ్యాన్స్ చేసింది. కూతురుతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసింది. తన డాన్స్ చూసుకుని సురేఖ వాణి కూడా మురిసిపోయి ఉంటుంది. అంతలా రెచ్చిపోయింది ఈ ఆంటీ. అయితే ఆ తరువాత ఈ వీడియో నెట్టింట్లో కనిపించి పెద్ద సంచలనమే సృష్టించింది.

కట్ చేస్తే.. లేటు వయసులో సురేఖకు ఇదంతా అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. కూతుర్ని ప్రమోట్ చేసుకునేందుకే సురేఖా ఇలా చేసిందని టీ టౌన్ లో వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇదంతా ఆమె కావాలనే చేసిందో లేక ఇంకెవరైనా చేశారో తెలియదు.కానీ, అది బయటికి వచ్చాక గానీ జరిగిన తప్పేమిటో సురేఖా వాణికి అర్ధం కాలేదు .ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయించడానికి ఎంత ఖర్చైనా పెట్టడానికి రెడీ అంటోందట సురేఖా. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో కదా.

- Advertisement -