భార్యాభర్తలుగా అర్బాజ్ ఖాన్ .. మలైకా అరోరా దాదాపు 19 యేళ్ల పాటు కలిసి జీవించారు. ఆ తరువాత ఆ కాపురంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఇద్దరూ విడిపోయారు. చట్టబద్దంగా ఇద్దరూ విడిపోయినా, అందుకు గల కారణాలు ఏమిటనేది అర్బాజ్ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా అర్భాజ్ ఖాన్ మలైకాతో విడిపోవడం గురించి తొలిసారి మాట్లాడారు.
అర్భాజ్ మాట్లాడుతూ.. మామధ్య సంబంధం బాగా సన్నగిల్లింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించేది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు భార్య భర్తలుగా కలసి ఉండడంలో అర్థం లేదు. ఎవరి జీవితం వాళ్లకు ఉందనే భావన వచ్చినప్పుడు విడిపోవడమే మంచిదనిపించినట్లు అర్భాజ్ ఖాన్ తెలిపాడు.
కాగా నాలుగు పదుల వయసులోనూ హాట్ అందాలతో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా కుర్ర హీరో అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తూ బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అర్భాజ్ ఖాన్ కూడా మరో మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడు.