‘మహర్షి’ నుండి మరో సాంగ్ వచ్చేసింది..

270
Maharshi 3rd Song Poster
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా మహర్షి సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..అల్లరి నరేష్ ప్రత్యేకమైన పాత్రలో నటించారు.

ఇటివలే ఈసినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ నుండి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి తాజాగా మరో పాటను విడుదల చేశారు చిత్ర బృందం.’ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే ఈ పాట వీడియో ప్రివ్యూలో పూజా హెగ్డె,మహేష్ ఎంతో స్టైలీష్ గా కనిపించారు.

సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, సి.అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 

- Advertisement -