వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించింది. లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు)తో చెలరేగడంతో లక్ష్యం చేధించడం సులువైపోయింది. సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6)పరుగులతో సరిపెట్టుకోగా మరోసారి జట్టు సంక్లిష్టంలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన హార్దిక్ పాండ్యా(28) చెలరేగగా ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0)లతో కలిసి విజయాన్ని రాబట్టారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6×4, 1×6), క్వింటన్ డికాక్(81, 52 బంతుల్లో 6×4, 4×6) మొదటి నుంచీ దూకుడుగా ఆడి ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరూ 96 పరుగులు జోడించాక రోహిత్ ఔటయ్యాడు. అనంతరం క్వింటన్ అర్ధశతకంతో చెలరేగి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సూర్యకుమార్(16), కీరన్‌పొలార్డ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో డికాక్, హార్దిక్ పాండ్య నిలకడగా రాణించారు. చివర్లో డికాక్, ఇషాన్ కిషన్(5) వెనువెంటనే ఔటైనా హార్దిక్ పాండ్య(28, 11 బంతుల్లో 1×4, 3×6) బౌండరీలతో చెలరేగి రాజస్థాన్ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.