బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొణె ఇటీవలె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది దీపికా. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్లపై మండిపడింది దీపికా.
తాను గర్భవతినని వస్తున్న రూమర్లకు స్ట్రాంగ్ కౌంటరిస్తూనే పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలా.. లేదంటే అదేమైనా నేరమా అంటూ ప్రశ్నలు గుప్పించింది. ఎది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని..పెళ్లైన వారిని పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకని వేదాంతం మాట్లాడింది. పెళ్లైన వెంటనే పిల్లలని కనాలా వద్దా అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని..పిల్లలు పుట్టాక వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేమని చాలామంది తనతో చెప్పారని వెల్లడించింది దీపికా.
పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలకు కమిట్ అవుతున్న దీపిక ప్రస్తతుం ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఛపాక్ సినిమాలో నటిస్తోంది. 2020 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన ప్రగ్నన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దీపిక.