- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి మాజీ ఛైర్మన్ వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1966లో రిపోర్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఆంధ్రప్రభ ఎడిటర్‌గా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా పనిచేసి 2018 డిసెంబర్లో రిటైర్మెంట్ అయ్యారు. వాసుదేవ దీక్షితులు పార్ధీవ దేహాన్ని సైనిక్‌పురి కల్యాణినగర్లోని ఆయన స్వగృహానికి తరలించారు.
- Advertisement -