ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలుః సీఎం కేసీఆర్

327
Kcr Speech
- Advertisement -

ఎన్నికలు వచ్చినపుడు చాలా మంది వచ్చి చాలా ముచ్చట్లు చెప్తారని కానీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు, పార్టీలు కాదని..ప్రజలు గెలవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిజాం కాలంలో టీబీ ఆస్పత్రిని వికారాబాద్‌లోనే పెట్టారు. అనంతగిరి కొండ మీద ఔషధ మొక్కల సువాసన వచ్చేది. సమైక్య రాష్ట్రంలో అంతా సర్వనాశనమైంది. సంకల్ప శుద్ధితో పోరాటం చేస్తే తెలంగాణ సిద్ధించింది.

తెలంగాణ వచ్చేటపుడు చాలా మంది చాలా రకాలుగా నన్ను ఎక్కిరించిర్రు, శాపాలు పెట్టిన్రు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను రోజు తిడుతున్నడు. ఒక ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వస్తే కరెంట్ ఉండది..తెలంగాణ చీకటి రాష్ట్రం అయితది అన్నడు..నీళ్లు రావు ఆగం అయితరు, మికు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడినారు. 5ఏండ్ల కింద మన కరెంటు ఎట్ల ఉండే ఇప్పుడు ఎట్ల ఉంది ప్రజలు ఆలోచన చేయాలే అని ప్రశ్నించారు.

వికలాంగులకు ఇచ్చే రూ.1500 ఇకపై రూ.3,000 చొప్పున ఇస్తామని వ్యాఖ్యానించారు. ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా వికారాబాద్‌కు తాగునీరు అందిస్తాం. వికారాబాద్ జిల్లా కావాలనే డిమాండ్ ఉన్నా ఎవరూ చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వికారాబాద్ జిల్లా అయిందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ రంజీత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిచాలన్నారు.

- Advertisement -