ఈనెల 24 నుంచి రంగంలోకి త్రివిక్రమ్ బన్నీ

328
allu arjun 19 moive
- Advertisement -

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్,, గీతాఆర్ట్స్ సంస్ధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె ను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్ అభిమానులు.

తాజాగా ఈసినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ను ఈనెల 24వ తేది నుంచి ప్రారంభించనున్నారట. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ రోజున అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రకటించారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసినిమాతో పాటు అల్లు అర్జున్ మరో రెండు సినిమాలు చేయనున్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో ఒక సినిమా చేయగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత బన్నీ ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంగా ఉన్నారు అభిమానులు.

- Advertisement -