టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ.. బాలీవుడ్ సూపర్‌స్టార్.. ఈ ఇద్దరూ అనుకోకుండా కలిశారు. అది కూడా ఇండియాలో కాదు. ఎక్కడో జపాన్ దేశంలో. భార్య సురేఖతో కలిసి జపాన్ టూర్‌కెళ్లిన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాడు ఆమిర్‌ఖాన్. దీంతో ఇద్దరు కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకోవడం ఇలా ఫోటోకు స్టిల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఎంతో స్పెషల్ గా అనిపించే ఈ మూమెంట్‌ని మెగా ఫ్యాన్స్ అప్పుడే వైరల్ చేసేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్… జపాన్‌లోని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో తనకు చిరంజీవి ఎదురయ్యారంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఆమిర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘నా ఫేవరేట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. వాట్ ఎ సర్ప్రైజ్. ఆయన నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరుతో చర్చించాను. మీరు ఎప్పుడూ మాకు ఎంతో స్ఫూర్తిదాయకం సర్.. లవ్’ అని పేర్కొన్నారు.