నల్లధనం నియంత్రణకు ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వూహించని రీతిలో అచరణలోకి వచ్చిన ఈ నిర్ణయం ప్రజలకుతాత్కాలిక ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ జాబితాలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు చేరింది. బిపాసా కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర లేక.. తన స్నేహితుడు, ఫ్యాషన్ డిజైనర్ రాకీస్టార్ నుంచి చిల్లర అప్పు తీసుకుందట.
బిపాషా బసు కోడిగుడ్లు వండుకోవాలని అనుకుందట. అయితే ఇంట్లో గుడ్లు లేవు. పోనీ తెప్పించుకుందాం అని చూస్తే.. తన దగ్గర వెయ్యి, 500 తప్ప వేరే నోట్లు ఏమీ లేవు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో తాను అప్పు చేసినట్లు బిపాషా బసు ట్వీట్ చేసింది. స్టార్వరల్డ్ రాకీ వద్ద నుంచి తాను డబ్బులు అప్పు తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి రోజు వచ్చింది దేవుడా అంటూ బాధపడింది. తనకు ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ బిపాసా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
మరోవైపు.. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్నట్లు కూడా ఆమె చెప్పింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి అత్తవారింటికి ఢిల్లీ వెళ్లడంతో.. అక్కడి కాలుష్యం బారిన పడి గొంతునొప్పి తెచ్చుకుంది. తిరిగి ముంబై చేరుకునేసరికి తనకు భరించలేని గొంతునొప్పి వచ్చిందని తెలిపింది. ఢిల్లీలో బయటి పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పిందీ భామ.