హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మరోసారి వార్తల్లో కెక్కారు. గతంలో అభిమానులపై చేయి చేసుకున్న ఆయన తాజాగా నోటికి పనిచెప్పాడు. బాలకృష్ణ మరో్సారి హిందుపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రచారంలో పాల్గోన్న ఆయన టీడీపీ కార్యకర్తలను బండబూతులు తిట్టాడు.
గొంతు కోస్తా, ఏసేస్తా రేయ్ అంటూ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ప్రచారంలో బాలకృష్ణతో పాటు తన భార్య కూడా పాల్గొంది. ఆయన నిన్న రాత్రి భార్యతో కలసి హిందూపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. బాలయ్యను చూసి సంబరంతో ఓ కార్యకర్త.. ‘మీకు 50 వేలు, 60 వేల మెజారిటీ వస్తుంది.. ’ అని అరిచాడు.
దీంతో అది విన్న బాలయ్య వేలల్లో మెజార్టీ ఏంటిరా ని అయ్యా అని తిట్టాడు. ఇలా హైప్ క్రియేట్ చేసేవారి పిక కోయాలి అని బెదిరించాడు. ఆ తర్వాత మరో కార్యకర్త మీకు 70 వేల మెజార్టీ వస్తుందని అరవగా..దీంతో బాలయ్య ఒక్క సారిగా రెచ్చిపోయారు. నీ అడ్రస్ చెప్పు, నీ పేరు చెప్పు అంత మెజర్టీ రాకుంటే నీ పీక కోస్తా అంటూ హెచ్చరించారు ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.