బీజేపీ నేతలకు షాకిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనకు డుమ్మా కొట్టారు. బీజేపీ బహిరంగసభ జరిగిన ఎల్బీస్టేడియ గోషామహల్ పరిధిలో ఉన్నా ఆయన హాజరుకాలేదు. లోక్ సభ అభ్యర్థుల సీట్ల కేటాయింపు జరిగినప్పటి నుండి రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జంటనగరాల ప్రచా వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. రాజాసింగ్ కీలక మోడీ సభకు డుమ్మా కొట్టడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ముందు నుంచి రాజాసింగ్‌కు సఖ్యత లేదు. పలుమార్లు బీజేపీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేగాదు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరి నుండి పార్టీ నాయకత్వం నిర్వహించే సభలు, సమావేశాలకు ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు తన ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీకి రాజీనామా చేశారు రాజాసింగ్. అయితే ఆయన రాజీనామా అమోదించని బీజేపీ నాయకత్వం గోషామహల్ సీటును రాజాసింగ్‌కే కేటాయించింది. టీఆర్ఎస్ గాలిలో పార్టీ నేతలంతా ఓటమిపాలవ్వగా రాజాసింగ్ ఒక్కడే విజయబావుట ఎగురవేసి పరువుకాపాడారు.