నాగ్ పూర్ లో జరిగిన భారత్- ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు నిలకడగా రాణిస్తోంది. తొలుత ట్రాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన కుక్ సేన తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల కోల్పోయి 314 పరుగులు చేసి..మ్యాచ్ పై పట్టుజారిపోకుండా జాగ్రత్తపడింది. ఇంగ్లాండ్ జట్టుకు వెన్నెముకగా మారిన జోయ్ రూట్,అజేయ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు. అలాగే మరో ఆటగాడు మొయిన్ అలీ కూడా 99 పరుగులు చేసి జట్టు పరుగులో కీలక భాగస్వామిగా మారాడు. 124 పరుగులు చేసిన రూట్ నిష్క్రక్రమించగా,,అలీ నాటౌట్‌గా నిలిచి సెంచరీ దిశగా కదులుతున్నాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన రెండు వికెట్లు పటగొట్టి,,ఇంగ్లాండ్‌ను దుకుడు కల్లెం వేశాడు.
అలాగే ఉమేష్ యాదవ్,,రవింద్ర జడేజా చేరో వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టు పుంజుకోకుండా కట్టడి చేశారు.
తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు కుక్,,అమీద్ తొలి సెషన్స్ లోనే తడబడ్డారు. కుక్ 21, ఆమీద్ 31పరుగులతో వెనుదిరిగారు. మిడిల్ ఆర్డర్‌గా బ్యాంటింగ్ కు దిగిన బెన్ డక్కెట్ ను ఏమాత్రం కుదురుకోకుండా చేసి,,13 పరుగులకే అవుట్ చేశారు. ఓ వైపు ఇంగ్లాండ్ జట్టు 103 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో,,,నాలుగో బ్యాట్స్ మెన్‌గా క్రిజ్‌లోకి వచ్చిన అలీ,,,రూట్ తో జతకట్టి ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసేలా పోరాడారు. రూట్, అలీ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాదాపు నాలుగు గంటలపాలు ఇద్దరు క్రిజ్‌లో పాతుకుపోయి,,భారత్ బౌలర్ల సహనాన్ని పరిక్షించారు. నిలకడక రాణిస్తూ…ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌పై పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్న రూట్, అలీ భాగస్వామ్యాన్నిబౌలర్ ఉమేష్ యాదవ్ విడగొట్టాడు. 124 పరుగుల వద్ద జోయ్ రూట్ ను పెలివియన్‌కు పంపాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ 19 పరుగులు చేసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు.