వినోద్, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది నా సెల్ఫీ. చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.
శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదల కాగా ఆ ఆడియో కి సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.. అంతేకాకుండా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులను కూడా అందజేయనున్నారు. ప్రేక్షకులు ఆసక్తికరమైన సెల్ఫీ ని ఫేస్ బుక్ లో ‘ ఇది నా సెల్ఫీ’ పేజీ కి టాగ్ చేసి పోస్ట్ చేయాలి.. దాంట్లో ఉత్తమమైన సెల్ఫీ ని ఎంపిక చేసి విజేతలుగా నిర్ణయిస్తారు..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత , దర్శకుడు సి.హెచ్ ప్రభాకర్ (చరణ్) మాట్లాడుతూ… సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా వచ్చిందన్నారు. రెండు గంటలు ప్రేక్షకులని మెప్పిస్తుందని… సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు..సెల్ఫీ ల మోజులకే పరిమితమయిపోతున్న ఈ జనరేషన్ ని మార్చే సినిమా ఇదన్నారు. ఇండస్ట్రీ లో చాల మంది పెద్ద మనుషులు ఉన్నారు కానీ పెద్ద మనసున్న మనుషులు కొంతమందే ఉన్నారు.. అందులో రాజ్ కందుకూరి ఒకరు.. మా చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్ చాల బాగుంది.. విజువల్స్ చాల బాగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది.. నటీనటులు చాల బాగా చేశారు.. ఈ సినిమా అందరు తప్పక చూడండి అన్నారు.
హీరో వినోద్ మాట్లాడుతూ.. సెల్ఫీ కాన్సెప్ట్ తో ఒక మంచి సినిమా చేసాం.. ఈ సినిమా కోసం అందరం చాల కష్టపడ్డాం.. సినిమా చాల బాగా వచ్చింది.. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా చేశారు.. అందరు నటీనటులు చాల బాగా చేశారు.. ఈ సినిమా ని , మమ్మల్ని అశిర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. అందరు ఈ సినిమా ని తప్పక చూడండి అన్నారు..