రివ్యూ: సూర్యకాంతం

533
suryakantham movie review
- Advertisement -

ఒక మనసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కొణిదెల నిహారిక. తొలిసినిమాతోనే మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత హ్యాపీ వెడ్డింగ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు విజయం సాధించక పోవడంతో లాంగ్ గ్యాప్ తర్వాత ‘సూర్యకాంతం’గా ప్రేక్షకుల ముందుకువచ్చింది.సూర్యకాంతంతో నిహారిక ఏ మేరకు ఆకట్టుకుంది..?మూడో సినిమాతో హిట్ సొంతం చేసుకుందా లేదా చూద్దాం..

కథ:

సూర్యకాంతం (నిహారిక‌) ఎవర్నీ తొంద‌రగా న‌మ్మే ర‌కం కాదు. అలాంటి అమ్మాయి జీవితంలోకి అభి (రాహుల్ విజ‌య్‌) వ‌స్తాడు. తొలిచూపులోనే సూర్యకాంతంను ప్రేమించే అభి తన మనసులోని మాటను చెప్పాలనుకునేలోపే దూరమైపోతుంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో వాళ్ల బాధలు భరంచలేక ఏడాది తర్వాత పెద్దలు కుదిర్చిన పూజ(పెర్లిన్‌) తో పెళ్లికి ఒప్పుకొంటాడు. కొన్ని రోజుల్లో ఎంగేజ్‌మెంట్ అన‌గా సూర్యకాంతం ప్రత్యక్షం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది..? అభి పూజను పెళ్లిచేసుకుంటాడా..?సూర్యకాంతాన్ని పెళ్లిచేసుకుంటాడా అన్నదే సినిమా కథ.

Related image

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సెకండాఫ్,మాటలు,సంగీతం,నిహారిక నటన. నిహారిక ఫస్టాఫ్‌లో కొంటెపిల్లగా సెకండాఫ్‌లో తన మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌ట పెట్టేందుకు ప్రయ‌త్నించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే నిహా నటన సూపర్బ్. రాహుల్ విజ‌య్‌, పెర్లిన్‌ల‌కి చక్కటి న‌ట‌న కనబర్చారు. ఇద్దర‌మ్మాయిల మ‌ధ్య న‌లిగిపోతూ భావోద్వేగాలు పండించే అభి పాత్రతో రాహుల్ మెప్పించాడు. మిగితా పాత్రల్లో శివాజీ రాజా,మధుమణి,సుహాసిని తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేకపోవడం, నెమ్మదిగా సాగే కథనం. ఫస్టా ఫ్‌లో అక్కడ‌క్కడా సున్నిత‌మైన హాస్యం.. పాత్రల ప‌రిచ‌యానికే ప‌రిమిత‌మైంది త‌ప్ప పెద్దగా క‌థేకు స్కోప్‌ లేదు. సూర్యకాంతం ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది?ఎందుక‌లా వ్యవ‌హ‌రించిందనడానికి కార‌ణాల్ని మాత్రం బ‌లంగా చెప్పలేక‌పోయాడు ద‌ర్శకుడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. వెబ్ సిరీస్ తీసి పేరు తెచ్చుకున్న ద‌ర్శకుడు ప్రణీత్ సినిమాని కూడా అదే త‌ర‌హాలో తీశారు. మార్క్ కె రాబిన్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రపీ,ఎడిటింగ్ పర్వాలేదు. జాస్తి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువ‌లకు వంకపెట్టలేం.

Image result for suryakantam movie review

తీర్పు:

ఒక అబ్బాయి జీవితంలో ఇద్దరమ్మాయిలొస్తే? వాళ్లిద్దరిలో ఏ ఒక్కరినీ దూరం చేసుకోలేని ప‌రిస్థితులు తలెత్తితే ఎలా ఉంటుంద‌నే కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సూర్యకాంతం. మాటలు,సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ సూర్యకాంతం.

విడుదల తేదీ:29/03/2019
రేటింగ్‌: 2.5 /5
నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌
సంగీతం: మార్క్‌ కె రాబిన్‌
నిర్మాతలు: వై. సందీప్‌, వై. సృజన, రామ్‌ నరేష్‌
దర్శకత్వం: ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి

- Advertisement -