వేల ఇల్లయ్ పట్టదారి ఎలియాస్ ”విఐపి” అనే తమిళ సినిమాని తెలుగులో రఘువరన్ బీటెక్గా డబ్బింగ్ చేశారు. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆడిందో తెలిసిన విషయమే. తాజాగా వేల్ రాజ్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నాడు ధనుష్. రఘువరన్ పాత్రలో మరోసారి రచ్చ చేయడానికి ఈసారి తనే స్వయంగా కథ మాటలు రాసుకుంటున్నాడు. మరి డైరక్షన్ ఎవరో తెలుసా? మొన్నామధ్య డాడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో యానిమేషన్ సినిమా తీసిన చిన్న కూతురు సౌందర్య.. ఇప్పుడు తన అక్కయ్య మొగుడు ధనుష్ ను డైరక్ట్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని కబాలి నిర్మాత కలైపులి థాను తో పాటు వార్డ్ రోబ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని విడుదల చేశారు. ఈ మూవీ గతంలో సూపర్ హిట్ విజయం సాధించిన వేలైఇల్లా పట్టాతారై(విఐపి) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. విఐపీ చిత్రం తెలుగులో రఘువరన్ బిటెక్ టైటిల్ తో విడుదలై ధనుష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సౌందర్య తీయనున్న మూవీ బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కనుండగా, ఈ మూవీని తెలుగులో విఐపీ2 టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. సౌందర్య మావయ్య కొడుకు అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. మొత్తానికి కుటుంబం మొత్తం ధనుష్ సినిమాలో భాగం అవుతుడడంతో తమిళ సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
https://youtu.be/t_MA6GROjyk