- Advertisement -
సీఎం కేసీఆర్ మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అందుగులపల్లికి చెందిన రైతు తన భూ సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూ ప్రక్షాళనలో భాగంగా తన ఏడు ఎకరాల భూమిని ఇతరులకు పట్టాచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో చూసిన సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించారు. రైతు శరత్‌తో స్వయంగా ఫోన్లో మాట్లాడి తానున్నాంటూ భరోసానిచ్చారు. సమస్యను పరిష్కరిస్తానిన హామీ ఇచ్చిన సీఎం మంచిర్యాల కలెక్టర్ భారతికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో అందుగుల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ శరత్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ చూపిన చొరవతో రైతు శరత్ ఆనందం వ్యక్తం చేశారు. తన భూమి తనకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
- Advertisement -