కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించు కోలేదుః మాజీ ఎంపీ రాపోలు

235
Rapolu anada Bhasakr
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఈసందర్భంగా ఆయన నేడు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ..గత 25సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశాను.. ఇప్పడు నన్ను పార్టీ పట్టించుకోవడం లేదు. తెలంగాణ వాణిని రాజ్యసభలో వినిపించిన వ్యక్తిగా తెలంగాణ సమాజం తనను మర్చిపోదని అనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎంతో మందికి శిక్షణ ఇచ్చానని..కానీ ఇప్పడు పార్టీ తన సేవలను వాడుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కవయ్యాని తెలిపారు.

కాంగ్రెస్ లో జరగుతున్న లోటుపాట్లను ఎన్నో సార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రజానీకపు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అప్రమత్తంగా వ్యక్తిగతంగా ప్రతీ నాయకుడు, ప్రతి ప్రజా ప్రతినిధి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముందు పార్టీ మారితే నేను స్వార్ధం కోసం మారను అనుకుంటారని అందుకే ఇప్పుడు పార్టీని విడుతున్నట్లు తెలిపారు. పార్టీలో నా వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ పనిచేయలేదని..తెలంగాణ ఆత్మగౌరవం కాపాడటం కోసం తాను ముందుంటానని తెలిపారు.

- Advertisement -