తెలుగు సినిమాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న కిస్సుల గురించి ఈమధ్య భారీగా చర్చ సాగుతోంది. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100సినిమాలపై టీవి ఛానళ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈసినిమాలపై పలు మహిళా సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ. ఈమూవీ ఎప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజిగా ఉన్నారు నాగ చైతన్య, సమంత. ఇటివలే ఈమూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈటీజర్ లో సెకండ్ హీరోయిన్ దివాంశ కౌశిక్..నాగ చైతన్యల మధ్య ఓ ముద్దు సీన్ ఉంది.
అయితే నాగ చైతన్య సినిమాల్లో ఇంతవరకూ ఇలాంటి ముద్దు సీన్లలో నటించలేదు. ఈముద్దు సీన్లపై కొంత మంది నెటిజన్లు ప్రశ్నించారు. పెళ్ళైన తర్వాత సమంతా చేస్తే తప్పు అన్నారు.. మరి పెళ్ళైన తర్వాత చైతు చేస్తే తప్పు కాదా? హీరోయిన్లకు ఒక రూల్.. హీరోలకు మరో రూల్ ఎలా చెప్తారు?” అంటూ సమంత ప్రశ్నించారు నెటిజన్లు. ఈప్రశ్నపై సమంత ఇట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇది కేవలం సినిమా మాత్రమే అని.. సినిమా డిమాండ్ మేరకు హగ్, ముద్దు సీన్లు ఉంటాయని.. వాటిల్లో నటించక తప్పదని సమాధానం చెప్పింది సమంత. దర్శకులు చెప్పినవి మాత్రమే తాము చేస్తామని తెలిపింది. సమంత వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలుకుతున్నారు.