సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మహేశ్ కు జోడిగా పూజా హెగ్డె నటిస్తుంది. ఇటివలే చిత్రకరణ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మే9 న ప్రపంచవ్యాప్తంగా ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరో అల్లరి నరేష్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. అయితే మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్ వంటివి విడుదల చేయకపోవడంతో చాలా నిరాశలో ఉన్నారు.
అభిమానుల కోసం త్వరలోనే ఓ గిప్ట్ ను ఇవ్వనున్నారు మహర్షి టీం. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మార్చి 29న తొలి లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు. అప్పటి వరకు క్యూట్ వీడియోతో ఎంజాయ్ చేయండని దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్యా, మహేష్ కూతురు సితారతో సరదాగా చేసిన డ్యాన్స్ వీడియోని షేర్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. జూనియర్ మహర్షి (సితార) తనకు డాన్స్ చేయటం నేర్పిస్తోంది అంటూ వీడియోకి కామెంట్ చేశాడు. మహేశ్ కూతురు, వంశీపైడిపల్లి కూతరుతో దేవి ఎంజాయ్ చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.