దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రూ.500, రూ.1000 నోట్ల చలామణి రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తీసుకొన్న నిర్ణయం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాని అభిమతం పట్ల దేశభక్తులు, అవినీతి వ్యతిరేకులు, ఆర్థికవేత్తలు, సాధారణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అంశం ఇప్పుడు గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్‌మీడియా వెబ్‌సైట్లలో ట్రెండింగ్‌గా మారింది. నల్లధనంపై మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కితాబిస్తున్నారు.
ప్రధాని తీసుకొన్న నిర్ణయంతో గూగుల్ ట్రెండ్స్‌లో అమెరికా ఎన్నికల అంశం జాడే లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా న్యూస్, మోదీ, 2000 ఆర్‌ఎస్ నోట్, 500 ఆర్‌ఎస్ నోట్, 2000 రూపీస్ నోట్ ఇండియా, ఇండియా కరెన్సీ, పీఎం మోదీ స్పీచ్, మోదీ స్పీచ్ లైవ్, బ్యాంక్‌నోట్ వంటి పేర్లతో విపరీతమైన సెర్చ్ జరుగుతోంది. మోడీ ప్రసంగ ప్రారంభంలో 5-10 శాతం ఉన్న ఆసక్తి క్షణాల్లోనే 100 శాతంగా మారిపోయింది.
అమెరికా ఎన్నికలను బీట్ చేసిన మోడీ మీడియా, భారత దేశ జనాభా అత్యంత ఆసక్తిగా అమెరికా ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు పరిస్థితి అలాగే ఉంది. కానీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత.. అమెరికా ఎన్నికలు ఎక్కడికో పోయాయి. మీడియా సహా జనాల దృష్టి ఒక్కసారిగా అమెరికా నుంచి మోడీ ప్రకటన వైపు మరలింది.
నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారు: జతిన్ ఆనంద్
నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ : అంజనా ఓ కశ్యప్
అవినీతి నిర్మూలనకు ఏ ప్రధానీ తీసుకోని సాహసోపేత నిర్ణయం మోదీ తీసుకున్నారు. ప్రధాని నిర్ణయంపై అవినీతి పరులు ఏడుస్తున్నారు: లిపి గాంధీ
బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రయిక్స్: మిథున్ గౌడ
ఇక 90 సంవత్సరాల్లో పుట్టిన వారికి రూ.1000, రూ.500 నోట్లు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి: ఐరన్ మ్యాన్