- Advertisement -
ఓవైపు లోక్ సభ కోలాహలం కొనసాగుతుండగానే, ఈ సందట్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు.
బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్‌కేంద్రాలకు తరలించారు. గురువారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రిని జిల్లాలు, నియోజకవర్గాలవారీగా కేటాయించి, సిబ్బందికి అందజేశారు. ఎన్నికలు జరిగే జిల్లాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
- Advertisement -