టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి..

254
Shadnagar
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటివలే వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. నిన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో కాంగ్రెస్ నేత ఆ పార్టీకి గుబ్ బై చెప్పారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ప్రతాప్ రెడ్డి ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి అంజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

ఈసందర్భంగా నేడు కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత జూపల్లి భాస్కర్ పలువురు కేటీఆర్‌ తో సమావేశమయ్యారు. రేపు సాయంత్రం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణియించుకున్నారు.

- Advertisement -