సార్వత్రిక ఎన్నికలను సమయం దగ్గరపడుతుంటంతో అభ్యర్దుల ఎంపీక పై అధికార టీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. పార్లమెంట్ అభ్యర్దుల ఎంపికకు సంబంధించి పార్టీ సినియర్ నేతలు, జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. నేడు ఎంపీ అభ్యర్ధులను ప్రకటించనున్న నేపద్యంలో సీఎం కేసీఆర్ వారికి ఫోన్లు చేసి నామినేషన్ కు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలని చెప్పారట. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్దులను ఢికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఎంఎల్ ఏ లతో చర్చించారు సీఎం. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇల్లందు, పినపాక మాజీ ఎంఎల్ ఏ లు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎంఎల్ సీ సత్యవతి రాథోడ్ లు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
మహబూబాబాద్ స్ధానం నుంచి ఎన్నికల ఇంఛార్జ్ గా సత్యవతి రాథోడ్ ను నియమించారు సీఎం. ఇక పార్లమెంట్ అభ్యర్దుల ఎంపీక ఖరారు కాగా వాటిలో కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో మెదక్ పార్లమెంట్ స్ధానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కరీంగనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎంపీ కవిత భర్త దేవెనపల్లి అనిల్ కుమార్, అదిలాబాద్ నుంచి నగేశ్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే కవిత, నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి పి.రాములు, మల్కాజ్ గిరి నుంచి సీనియర్ నాయుకులు నవీన్ రావు, పలువురి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తుంది.