తెలంగాణలో కాంగ్రెస్ ఖాళి అవడానికి కారణాలేంటో తెలుసా?

278
uttam gandhi bahvan
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందా? ఇక ఆ పార్టీలో మిగిలేది ఎంత మంది? 130ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సొంత గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోపోవడానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు వెళ్లడానికి కారణాలు ఏంటి? వీటన్నింటికి ఒకటే సమాధానం చెబుతున్నారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు , నేతలు. పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లే తాము పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యేలు. లాబీయింగ్ చేసుకునే వారికే టీకెట్లు, పదవులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. గ్రూపు రాజకీయాలే ఆపార్టీని కొంపముంచాయంటున్నారు మరికొంతమంది. పార్టీలో సీనియర్లే ఆధిపత్యం చెలాయించడం, కొత్త వారికి అవకాశాలు లభించకపోవడం పట్ల పార్టీ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

ఇటివలే పార్టీ మారిన నేతలు అయితే పిసిసి అధ్యక్షుడు వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్ నేతగా ఉన్నా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతోనే టీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో సినియర్ నాయకురాలు మాజీ మంత్రి డికే అరుణ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడా పార్టీ అధిష్టానం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రూపు తగాదాల వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పుడు పార్టీలో ఉన్న నేతలు కూడా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్ధానాల్లో విజయం సాధిస్తే ప్రస్తుతం అందులో 9మంది మాత్రమే ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా పార్టీ మారడంతో ఏం చేయాలో అర్ధం కానీ పరిస్ధితిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక కాంగ్రెస్ పార్టీలో మిగిలేది 5గురు మాత్రమే అని చెప్పుకోస్తున్నారు పార్టీ మారిన నేతలు. ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కారణమైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ మారుస్తారా లేదా చూడాలి మరి.

- Advertisement -