గులాబీ బాస్ ‘మిషన్ 100’ సక్సెస్..

387
cm kcr
- Advertisement -

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొంటుండటంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం టీఆర్ఎస్ బలం పెరుగుతూ వస్తుంది. . ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 88స్ధానాల్లో విజయం సాధించింది. ఆతర్వాత ఇండిపెండెంట్లు గా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు కలుపుకుని మొత్తం 11 మంది కారెక్కేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్, సబితాఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, తాజాగా వనమా వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లుగా ప్రకటించారు.

అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరందరిని కలుపుకుని ఇప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈసారి 100సీట్లు సాధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వంద సీట్లు కళ నిజం అయింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ అనుకున్న మిషన్ 100 పూర్తయింది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పార్టీలో చేరడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 100కు చేరుకుంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్ కలిశారు.

అనంతరం కేసీఆర్‌ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హర్ష లేఖ విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అందులో తెలిపారు. ఇంతటితో ఆగకుండా మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిషన్ 100 సక్సెస్ తో ఈ వలసలు ఆగుతాయో లేక మరికొంత మంది ఎమ్మెల్యేలు క్యూ కడతారో వేచి చూడాలి మరి.

- Advertisement -