గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్న శంకర్ ఎటకేలకు ‘భారతీయుడు 2’ను సినిమాను పట్టాలెక్కించాడు. కానీ ఈ మూవీ ప్రారంభించిన కొద్ది రోజులకే కొన్ని కారణాలవలన ఆగిపోయింది.
అయితే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, దర్శకుడు శంకర్‌కు మధ్య బడ్జెట్ విషయంలో విభేదాలు వచ్చాయని అందుకే సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగగా.. ఏ.ఆర్ రెహమాన్‌ను కాకుండా అనిరుధ్ సంగీత దర్శకుడిగా తీసుకోవడం శంకర్‌కు నచ్చలేదని అందుకే సినిమా ఆగిపోయిందని మరో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ‘భారతీయుడు 2’ షూటింగు సవ్యంగా సాగకపోవడానికి అసలు కారణం కమల్ మేకప్ అని తెలుస్తోంది. గతంలో కమల్‌కు సేనాపతి పాత్రకి గాను వృద్ధుడిగా మేకప్ వేస్తే ఏమీ కాలేదు. కానీ ఈ సారి ఆయనకి వృద్ధుడిగా మేకప్ వేసిన ప్రతిసారి స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారట. అందువల్లనే షూటింగ్ ఆపారని అంటున్నారు. మరి ఈ సమస్యకు దర్శకుడు శంకర్ ఎలాంటి పరిష్కారాన్ని అలోచిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో కమల్ హసన్‌కు జోడిగా కాజల్ కనిపించనుంది.