సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో ఎదో వివాదం సృష్టిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈసినిమా తీసిన వర్మ ఇందులో అన్నే నిజాలే చెబుతానంటూ టీజర్, ట్రైలర్, పాటలతో సంచలనం రేపాడు. అయితే ఈసినిమా మొదటి నుంచి ఎదో ఒక వివాదాన్ని సృష్టించి పబ్లిసిటి చేసుకుంటున్నాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలను ఆపీవేయాలంటూ ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కేసులు పెట్టారు.
తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. సెన్సార్ బోర్డు సైతం వర్మ సినిమాకు సెన్సార్ చేసేందుకు నిరాకరించింది. దీనిపై ట్వీట్టర్ ద్వారా స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని వాయిదావేసే హక్కు సెన్సార్ బొర్డుకు లేదన్నారు. మొదటి దశ పోలింగ్ వరకు వాయిదా వేస్తామనడం సరికాదన్నారు వర్మ. సెన్సార్ బొర్డు సభ్యులు వారి భాద్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు సెన్సార్ బోర్డుపై కేసు వేయబోతున్నానని తెలిపారు. వర్మ మాత్రం ఈసినిమాను ఎలాగైనా ఎన్నికలకు ముందే విడుదల చేస్తానని పట్టుబడుతున్నారు. ఇక మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఆడియో వేడుకను కడప నిర్వహించనున్నట్లు తెలిపారు వర్మ.