సాయిప్రణీత్‌ సంచలనం విజయం..

252
Sai Praneeth
- Advertisement -

భారత యువ ఆటగాడు సాయిప్రణీత్‌ సంచలనం సృష్టించాడు.. స్విస్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ టోర్నీలో భాగంగా జరిగిన పోటీలో క్వార్టర్ ఫైనల్స్‌లో చెన్‌ పై తలపడిన అన్ సీడెడ్ ప్రణీత్, 21-18, 21-13తో విజయం సాధించాడు. ఈ టోర్నీలో చెన్ లాంగ్ రెండో సీడ్‌ గా బరిలోకి దిగడం గమనార్హం.

హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో సగభాగం వరకూ వెనుకబడిన ప్రణీత్‌, ఆపై ప్రత్యర్థి స్కోరును సమం చేసి, ఆ వెంటనే తనదైన ఆటతీరుతో 19-15తో ఆధిక్యం పొందాడు. ఆపై లాంగ్ అతనికి చేరువకు వచ్చినా, తొలి సెట్‌ను గెలుపొందిన ప్రణీత్, అదే ఉత్సాహంతో రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు.

Indian shuttler B Sai Praneeth

అంతకుముందు క్వార్టర్స్‌లో ప్రణీత్‌ 21-13, 21-11తో లుకాస్‌ కోర్‌వి (ఫ్రాన్స్‌)ని ఓడించాడు. మరో భారత ఆటగాడు శుభాంకర్‌ డే క్వార్టర్స్‌లో 18-21, 17-21తో చెన్‌లాంగ్‌ చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సిక్కి-అశ్విని 17-21, 17-21తో మట్సుయామా-చిహరు (జపాన్‌) చేతిలో ఓడారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో అర్జున్‌-మనీషా 19-21, 16-21తో మతియాస్‌-సోబె (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలవగా.. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ప్రణవ్‌ చోప్రా-చిరాగ్‌ శెట్టి 11-21, 26-28తో మార్కస్‌ ఎలిస్‌-క్రిస్‌ లాంగ్రిడ్జ్‌ (ఇంగ్లాండ్‌) చేతిలో ఓటమి చవిచూశారు.

- Advertisement -