తాను చనిపోలేదని క్షేమంగా ఉన్నానిన తెలిపారు హీరో సునీల్. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దని అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు సునీల్. నేను ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యానని వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. అది పూర్తిగా తప్పుడు వార్త. ఏదో వెబ్సైట్ తన వ్యూస్ పెంచుకోడానికి ఈ నీచమైన పని చేసినట్టుంది. మీ ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నా.. దయచేసి ఆందోళన చెందొద్దు. ఆ వార్తలను నమ్మొద్దు అని తెలిపారు.
Don't believe it, It's a fake news I'm absolutely fine and please don't trust these articles. pic.twitter.com/pdU9hDVEEY
— Sunil (@Mee_Sunil) March 15, 2019
వ్యూస్ కోసం ఇలాంటి వార్తలు రాసే వారిని శిక్షించాలని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ఘోరమైన వదంతులు రాయడం సరికాదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని కొంత మంది కామెంట్లు పెట్టారు. సదరు వెబ్‌సైట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సునీల్‌ను కోరారు
రోడ్డు ప్రమాదంలో సునీల్ దుర్మరణం చెందారని ..సునీల్ కారు నుజ్జునుజ్జైందని.. ఆయణ్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారని కథనాలు ప్రచురించింది ఓ వెబ్ సైట్. దీంతో టాలీవుడ్లో కలకలం రేగింది. సునీల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ వార్తలపై సునీల్ క్లారిటీ ఇచ్చారు.
There is a fake news doing rounds, that I have met with a fatal accident. It is rubbish some loser has done that for its view increase. Please don't worry I am absolutely hail and hearty with your blessings.
– Sunil pic.twitter.com/ZZErhhgYcv
— Sunil (@Mee_Sunil) March 15, 2019