వివేకా హత్య.. అతడిపై అనుమానాలు..!

224
- Advertisement -

వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తొలుత గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారనే వార్త వెలుగు చూసినా, అది హత్య.. అన్న అనుమానాలు కొద్దిగంటల్లోనే తెలిపోయింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, ప్రభుత్వం ‘సిట్‌’ కూడా ఏర్పాటు చేసి, ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చుతామంటోంది.

YS Vivekananda Reddy

ఈ నేపథ్యంలో హంతకుడు ఎవరన్నదానిపై వివేకా కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ రెడ్డికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో కూడా సుధాకర్ రెడ్డి నేరస్తుడు అని సమాచారం. ఇప్పటివరకు కడప సెంట్రల్ జైలులో ఉన్న సుధాకర్ రెడ్డి మూడేళ్ల కిందటే సత్ప్రర్తన కారణంగా విడుదలయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుంది.

ఇదిలావుండగా వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. ఇవాళ సాయంత్రం పులివెందులలోని వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న జగన్‌ ముందుగా నివాళి అర్పించి.. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.

- Advertisement -