తెలంగాణకు అంతర్జాతీయ అవార్డు..

306
Theme Song of Telangana Tourism
- Advertisement -

మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పర్యాటక ప్రదేశాలను ప్రపంచ నలుములకు తెలిపేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. వారు చేసిన కృషి గానూ పలు అవార్డులు కూడా గెలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం డిపార్ట్‌మెంట్ సహకారంతో దూలం సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన తెలంగాణ పాటకు అంతర్జాతీయ అవార్డు లభించింది.

Theme Song of Telangana Tourism

ఇటీవల జపాన్ వరల్డ్స్ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా తెలంగాణకు చెందిన టూరిజం థీమ్ సాంగ్‌ ఉత్తమ సినిమా అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటక రంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు.

తెలంగాణ చారిత్ర, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి అని చెప్పవచ్చు.. ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సంస్కృతీ.. సాహిత్యాలు విలసిల్లుతున్నాయి. అలాగే పండుగలకు కూడా ఎంతో ప్రాధాన్యం వుంది. బతుకమ్మ, బోనాలు,మేడారం.. ఉత్సవాలు ఎంతో గొప్పగా జరుపుకంటాం. ఇవేకాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు పేరుపొందినవి. వాటన్నింటినీ ఈ పాటలో చూపించారు. తెంగాణ గొప్పతన్నాన్ని చాటిచెప్పారు.

తెలంగాణ పాటకు అంతర్జాతీయ అవార్డు..

- Advertisement -