ఇక సెన్సార్ కట్‌ లేనట్టే..

320
- Advertisement -

ఇక నుంచి సినిమాలకు,,,సెన్సార్ నుంచి కత్తెర గొడవ తప్పనుంది. గతంలో అడల్ట్‌ సినిమాలకు,,లైంగికపరమైన సన్నివేశాలకు, ముద్దు సీన్లకు కేంద్ర సెన్సార్ బోర్డు కత్తెర విధించేంది. అసభ్యకర సన్నివేశాలకు కత్తెర వేయడమే కాకుండా..ఆ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ అనే సర్టిఫికెట్ ఇచ్చేది. దీంతో సృజనాత్మకతకు,,స్వేఛ్చను హరిస్తున్నారంటూ చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడం,, బోర్డ్ సభ్యులకు, నిర్మాతలకు తరుచు గొడవలు జరగుతుండేవి. ఈ నేపథ్యంలో ఇక ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం.. దర్శకుడు శ్యాంబెనగల్ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది. దీనిపై సుదీర్ఘఃంగా విశ్లేషణ చేసిన కమిటీ… చర్చోపచర్చల అనంతరం బోర్డుకు పలు సూచనలు చేసింది.

ggg
సీన్లను కత్తిరించడంగానీ, కొన్ని పదాలను నిషేధించడంగానీ చేయకుండా.. వాటికంటూ ప్రత్యేక సర్టిఫికెట్..రేటింగ్  ఇచ్చే విధానాన్ని బెనగల్ కమిటీ సెన్సార్ బోర్డు ముందుంచింది.  అడల్ట్ కంటెంట్ సినిమాలకు కూడా అనుమతిచ్చేలా,,, సర్టిఫికేషన్, రేటింగ్ ఇవ్వాలంటూ కమిటీ సూచించింది. అంటే సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి కత్తెర విధించకుండా..కేవలం సినిమాకు కేటగిరిని మాత్రమే నిర్ణయించనుంది. దీనికి సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఓకే చెప్పింది. దీంతో చిత్రసీమలో కొంతకాలంగా జరుగుతున్న సెన్సార్ కత్తెరలకు పుల్ స్టాప్ పడినట్టైంది. ప్రభుత్వం కూడా దీనిపై సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనుంది.

benegal_

దీని ప్రకారం సినిమాల విడుదలకు ముందు ఇచ్చే సర్టిఫికెట్ విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డు పని మరింత పరిమితం కానుంది. కాగా, బెనగల్ సూచించిన ప్రతిపాదనలు నేరుగా అమలుచేయడం సాధ్యం కాదు. వీటిని తొలుత సీబీఎఫ్సీ కేంద్ర సమాచార ప్రసారాల వ్యవహారాల శాఖకు పంపించనుంది. వాటిని పరిశీలించి అంగీకరించి సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని/నిబంధనను సవరిస్తేగానీ ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. కాగా, టీవీ చానెళ్లలో ఇలాంటి సినిమాలు ఎలా ప్రసారం చేయాలనే అంశంలో మాత్రం స్పష్టత రాలేదు.

alia-anushka_

- Advertisement -