అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్ఆర్ మూవీ అప్ డేట్స్ ఇచ్చేశారు రాజమౌళి. నిర్మాత డీవీవీ దానయ్య,ఎన్టీఆర్,రాంచరణ్‌లతో కలిసి సినిమా కథ,రిలీజ్ డేట్ వంటి విషయాలను వెల్లడించారు. 2020 జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని తెలిపారు. ఇప్పట్లో ఫస్ట్ లుక్,టీజర్‌లుండవని చెప్పిన జక్కన్న దేశవ్యాప్తంగా సినిమా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.
1920లో ఉత్తరభారతదేశంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్,కొమురంభీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి.
350 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఆయన పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేది ఉండగా, ఇది పవర్ ఫుల్‌గా ఉంటుందట. ఇక చరణ్ సరసన అలియా భట్ కథానాయికగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జర్ జోన్స్ జోడి కట్టింది. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.