నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా సాయిచంద్‌..!

663
sai chand singer
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ఎంపీ టికెట్ ఆశీస్తున్న ఆశావాహులతో ప్రధానపార్టీ నేతల్లో హీట్ పెరిగిపోతోంది. ఇక అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుండి అభ్యర్థిత్వం ఆశీంచే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పలువురు సిట్టింగ్‌లకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నాలుగైదు స్ధానాల్లో అభ్యర్థులను మారుస్తారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆయా స్ధానాల నుండి సీటు దక్కించుకొని విజయబావుటా ఎగురవేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీగా బరిలో దిగేందుకు ఆసక్తిచూపిస్తున్నారు గాయకుడు సాయిచంద్‌. రసమయి బాలకిషన్‌ సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక విభాగాన్ని ముందుకు తీసుకెళ్తున్న సాయిచంద్‌ ఎంపీగా పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్‌ దగ్గరి నుండి కేటీఆర్,హరీష్‌,కవిత అందరితో సాయిచంద్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీనికి తోడు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరు ఒకవేళ సాయిచంద్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఛాన్స్‌ పోటీచేసుందుకు గ్రౌండ్ ప్లాన్ ప్రీపేర్ చేసుకుంటున్నారు సాయిచంద్‌. సాయిచంద్ తో పాటు మందా జగన్నాథం, పి రాములు నాగర్ కర్నూల్ సీటు కోసం పోటీపడుతున్నారు.

నాడు తెలంగాణ ఉద్యమమైనా నేటి బంగారు తెలంగాణ సాధనలోనైనా ఏ మీటింగ్ జరిగిన సాయిచంద్ పాట ఉండాల్సిందే. అమరుల యాదిలో పాట పాడిన,కళ్లు మండుతున్నయి కాంగ్రెసోళ్లకు..కడుపుమండుతుంది ప్రతిపక్షాలకు అంటూ వారి వైఖరిని ఎండగట్టిన, కల్వకుంట్ల వారసుడు..కత్తిలాంటి నాయకుడు అంటూ కేటీఆర్‌ని పొగుడుతూ పాడాలన్న అది సాయిచంద్‌కే చెల్లింది. ఏ పాటైన సభికులను అలరించి,ఆలోచించేలా చేయడం సాయిచంద్ సొంతం. సాయిచంద్ పాట పాడుతుంటే ఆయనతో పాటే పదం కలపడం,డ్యాన్స్‌ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన పాటలతో టీఆర్ఎస్ మేనిఫెస్టోని,కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ సాధించిన సాయిచంద్‌ తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో నాగర్‌ కర్నూల్ స్ధానం నుండి సాయిచంద్ పోటీచేస్తారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -