మధ్యతరగతి వారి పెళ్లిలో భోజనాల ఖర్చు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఉండొచ్చు. సంపన్నులైతే స్టేటస్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కొందరు శ్రీమంతులు పెళ్లి భోజనాలకు రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరెవరూ చేయని విధంగా తన కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లికార్డులతో అందరి అశ్చర్యపరిచిన గాలి జనార్ధన్,,పెళ్లి భోజనాల విషయంలో కూడా సంపాదన రేంజ్ ఏంటో,,చూపించాడు. కూతురు వివాహా భోజనాలకు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని చెబుతున్నారు. దాదాపు వెయ్యి రకాల వంటకాలు ఆహూతులను అలరించనున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వంటకాలన్నీ అతిథులకు వడ్డించాలని జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాజీవ్ రెడ్డితో గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరగనుంది. ఈ నెల 16న బెంగళూరు ప్యాలెస్ లో ఈ వివాహం జరగబోతోంది. మొత్తం వివాహ ఖర్చు రూ. 250 కోట్లకు పైగానే చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఎవరు చేయని రేంజ్ లో కూతురు వివాహన్ని అంగరంగ వైభవంగా చేయాలని చూస్తున్నాడు గాలి. గతంలో మైనింగ్ శాఖ మంత్రి గా పని చేసిన గాలి బాగానే వెనకేశాడు. మైనింగ్ శాఖ మంత్రిగా పని చేసిన గాలి జనార్థన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ కింద కొంతకాలం పాటు,,శిక్ష కూడా అనుభవించాడు. ఈనెల 16న జరిగే కూతురు వివాహ వేడుకకు,,,చాలా మంది విఐపీలు హాజరు కానున్నారట. ధనం ఇజం జగత్ అంటే ఏంటో,,గాలి వారి పెండ్లి సందడి తో మరోసారి రుజువు అయింది. డబ్బులుండేలా గానీ,,,పెళ్లి కి వందకోట్లు ఏం కర్మ,,వేల కోట్లు ఖర్చు పెట్టొచ్చు.
https://youtu.be/0IRs3s-w3ac