రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి 17 ఎంపీ స్ధానాలను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. ఈమేరకు ట్వీట్టర్లో ట్వీట్ చేసిన ఓవైసీ 17కు గాను 17 స్ధానాల్లో తామే గెలస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం సీ ఓటరు సర్వేలో టీఆర్ఎస్ 16 ఎంపీ స్ధానాల్లో గెలుస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. సీ ఓటర్ సర్వేను కేటీఆర్ ట్వీట్ చేయగా అదే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన అసద్ టీఆర్ఎస్ విజయం సమాజంలో ప్రతి వర్గానికి విజయసంకేతంగా నిలుస్తుందన్నారు. ఈ విక్టరీతో నిజమైన ఫెడరల్ సామ్రాజ్యాన్ని స్ధాపిస్తామని..ఇది కచ్చితంగా జరుగుతుందని ట్వీట్లో తెలిపారు.
17-0 inshallah will definitely happen ,people of Telangana will bless& support KCR once again for it will be a victory of every section of society ,victory to realise & achieve true Federalism https://t.co/cO0hwJCeqs
— Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2019