- Advertisement -
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని.. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సీఎం ఆకాంక్షించారు మహిళలు స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మహిళల స్వయం సాధికారత దిశగా సమాజం పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ఇచ్చింది.
- Advertisement -