మన హీరో…వచ్చేశాడు:ఆలియా

263
abinandan aliabutt
- Advertisement -

భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన వింగ్ కమాండర్ అభినందన్ పేరు మారు మోగిపోతుంది. చిన్నారుల నుంచి వృద్దుల వరకు ఎక్కడా విన్నా అభినందన్ పేరే వినిపిస్తుంది. వీరుడిని సెల్యూట్ చేస్తూ యావత్ దేశం సంబరాలు చేసుకుంటోంది.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరనుంచి విడులై స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. అభినందన్ రాకపై బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ స్పందించింది. మన హీరో ఇంటికొచ్చేశాడు ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతూ ట్వీట్ చేసింది.

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ అభినందన్‌కు స్వాగతం పలకుతూ ఆయన ధైర్య సాహసాలను కొనియాడగా మన హీరో తిరిగొచ్చేశాడు అంటూ షాహిద్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ స్టార్స్‌,సోషల్ మీడియాలో వీరుడికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ధైర్యవంతుడైన పైలట్‌ అభినందన్‌ ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అభినందన్‌ రాకను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా సహా పలువురు స్వాగతించారు.

- Advertisement -