కళ్యాణ్ రామ్‌తో బాలయ్య..కన్ఫామ్‌..!

272
nbk kalyan ram
- Advertisement -

ఇటీవల నందమూరి హీరోల ఏ సినిమా రిలీజైన వారంతా ఒక్కటిగా కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అబ్బాయిలు కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రీ రిలీజ్‌కు అతిథిగా బాబాయ్‌ బాలయ్య,బాబాయ్‌ సినిమాలకు గెస్ట్‌గా అబ్బాయిలు రావడం మాములైపోయింది. తాజాగా కళ్యాణ్ రామ్‌ 118 ప్రీ రిలీజ్‌కు అతిథిగా హాజరై ఈ సంప్రదాయాన్ని కంటిన్యూచేశారు బాలయ్య.

ఇక తాత ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌ ప్రారంభించిన కళ్యాణ్ రామ్‌ సొంతంగా సినిమాలు తీస్తున్నారు. ఇక కళ్యాణ్‌ రామ్‌కు ఎప్పటినుండో ఓ కోరిక మిగిలిపోయిందట. తాత పేరు మీద స్థాపించిన బ్యానర్లో తనకి అత్యంత ఇష్టమైన బాబాయ్‌తో ఓ సినిమా తీయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. పలుమార్లు తన మనసులోని కోరికను బాబాయ్‌తో చెప్పిన కళ్యాణ్ రామ్‌ ఎట్టకేలకు బాలయ్యను ఒప్పించారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

బాలయ్య ఒకే చెప్పడంతో పలువురు దర్శకులతో మాట్లాడుతూ బాబాయ్‌కి సరిపోయే కథ కోసం అన్వేషిస్తున్నాడు కళ్యాణ్ రామ్‌. ఇప్పటికే తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ చేసిన కళ్యాణ్ రామ్‌ అన్ని కుదిరితే బాబాయ్‌తో సినిమా చేసి తన కల నెరవేర్చుకోవాలని ఆరాట పడుతున్నాడు.

- Advertisement -