- Advertisement -
ఏపీలో టీడీపీ,బీజేపీలతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు వైసీపీలోకి క్యూకడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు బంధువు,జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు నార్నె.
జగన్ కుటుంబసభ్యులతో తనకు పదేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు నార్నె. వైసీపలో చేరడానికి,జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ను సీఎం చేయడమే తన లక్ష్యమని తానే ఏ సీటు ఆశించి వైసీపీలో చేరడం లేదన్నారు. ఒకవేళ జగన్ ఆదేశిస్తే పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
నార్నె సొంత జిల్లా గుంటూరు. చిలకలూరిపేట నుండి ఆయన పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు,ఎంపీలు,కీలక నేతలు పార్టీని వీడటం చంద్రబాబును కలవరపెడుతోంది.
- Advertisement -