శేఖర్ మాస్టర్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

239
sheaker master
- Advertisement -

శేఖర్ మాస్టర్ ఢి ప్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లుగా ఆయన ఢి ఫోకు జడ్జ్ గా వ్యవహిరిస్తున్నారు. ఈ షోలో జడ్జ్ గా చేయడం వల్ల ఆయనకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే ఓ ఇంటర్యూలో పాల్గోన్న శేఖర్ మాస్టర్ తన లైఫ్ లో జరిగిన సన్నివేశాలను తెలియజేశారు.

తనకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అని డ్యాన్సర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా నేను కుదురుకోకముందు చాలా కష్టాలు పడ్డాను. డాన్సర్ గా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే అవకాశం వచ్చేదన్నారు. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుందామంటే .. వాళ్లు వెనక్కి వచ్చేయమంటారని భయంవేసేదని అందువల్ల సినిమాలకు , సీరియల్స్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్లడం మొదలుపెట్టానని చెప్పారు.

ఆరోజుల్లో నేను జూనియర్ ఆర్టీస్టుగా మొట్టమెదటి సారిగా రూ75 తీసుకున్నానని తెలిపారు. ఆ డబ్బులు చూసుకొని చాలా ఆనందపడ్డానని చెప్పారు. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డ్యాన్స్ మాస్టర్ లలో ఒకరిగా ఉన్నారు. ఇప్పటివరకూ టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో ఆయన పనిచేశారు.

- Advertisement -