ఎన్నికల తర్వాత నిరుద్యోగభృతి:సీఎం కేసీఆర్

212
kcr batti
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల తర్వాత నిరుద్యోగభృతి అమలుచేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చసందర్భంగా మాట్లాడిన సీఎం పనులు పారదర్శకంగా జరగాలనే రెవెన్యూ శాఖను తనవద్దే ఉంచుకున్నానని తెలిపారు.

నిరుద్యోగ భృతి అమలు కోసం అధ్యయనం చేస్తున్నామని.. సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత నుండే భృతి ఇస్తామన్నారు. ఓట్ల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉండదని తేల్చిచెప్పారు. గతంలో కూడా టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విపక్షాలు చాలా నిందలు వేశాయని ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌ వైపే నిలిచారన్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో నంబర్‌ వన్‌గా ఉన్నామని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ తలసరి వినియోగంలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి 5వేల మెగావాట్లకు పైగా పెంచామని సీఎం తెలిపారు.కాంగ్రెస్‌ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని.. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లలో బీసీలకు 50 శాతం ఇచ్చింది తెరాసయే అని చెప్పారు. బీసీల కోసం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమదన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు అటవీ భూములకు పట్టాలు ఇచ్చి రైతులను మభ్యపెట్టిందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన విద్యుత్‌ సమస్య ఉండేదని సీఎం గుర్తు చేశారు. పనులు పారదర్శకంగా జరగాలనే రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలో రైతుబంధు కొనసాగుతుందన్నారు.

- Advertisement -