చిత్ర పరిశ్రమలో ఆస్కార్ (అకాడమీ) కు ఉన్నంత విశిష్టత మరే పురస్కారానికి లేదంటూ అతిశయోక్తి కాదు. హాలీవుడ్ సినిమా పండగగా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాలన్నీ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారన్నా ఆస్కార్ అవార్డు అందుకుంటే ఇంక సాధించాల్సిందేమీ ఉండదని సినీ ప్రముఖులు భావిస్తుంటారు. సినీ అవార్డుల్లో ఎవరెస్ట్ లాంటి ఆస్కార్ పురస్కారోత్సవం ఇప్పుడు మళ్లీ వచ్చింది. 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలో ప్రముఖ హాలీవుడ్ తారా గణమంతా సందడి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి పురస్కార ప్రదానోత్సవం ప్రారంభమైంది.
ఈ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతి ఏటా హాలీవుడ్లో ప్రదానం చేస్తుంది. హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ ఈసారి అవార్డుల కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. ఈసారి ఉత్తమచిత్రం రేసులో బ్లాక్ పాంథర్, వైస్, రోమా, బొహేమియన్ రాప్సొడీ, ఏ స్టార్ ఈజ్ బోర్న్ తదితర చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటుడి అవార్డు కోసం క్రిస్టియన్ బేల్, బ్రాడ్లీ కూపర్, విలెమ్ డాఫో, రామి మాలెక్, విగ్గో మార్టెన్సమ్ పోటీపడుతున్నారు. మొత్తం 24 కేటగిరీల్లో 52 సినిమాలు బరిలో నిలిచాయి.
ఆస్కార్ విజేతల వివరాలు..
ఉత్తమ దర్శకుడు-అల్పాన్సో కురోన్ (రోమా)
ఉత్తమ నటుడు-రమి మలేక్ (బొహిమియాన్ రాప్సోడీ)
ఉత్తమ నటి-ఒలివియా కోల్మన్ (ది ఫేవరేట్ )
ఉత్తమ సహాయ నటుడు-మహెర్ షాలా అలీ (గ్రీన్ బుక్ )
ఉత్తమ సహాయ నటి-రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ )
ఉత్తమ ఛాయాగ్రాహకుడు-అల్ఫాన్సో కరోన్ (రోమా)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్
ఉత్తమ స్ర్కీన్ ప్లే-నిక్ వల్లేలాంగా, బ్రెయిన్ కూరీ, పీటర్ ఫారెల్లీ (గ్రీన్ బుక్)
ఉత్తమ సంగీతం-లేడీగాగా (షాలో సాంగ్) సహరచయితలు మార్క్ రోన్సాన్, ఆంథోని ఆండ్రూవాట్ (ఎ స్టార్ ఈజ్ బర్న్ )
ఉత్తమ విదేశీభాషా చిత్రం-రోమా