రోజుకు 20గంటలు పనిచేస్తాః మంత్రి శ్రీనివాస్ గౌడ్

716
srinivas goud minister
- Advertisement -

తనను నమ్మి మంత్రి పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు రాష్ట్ర రాష్ట్ర ఎక్సైజ్‌, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్‌. సచివాలయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. రోజుకు 20 గంటల పాటు కష్టపడి పనిచేసి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచడానికి తాను కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే ఎక్సైజ్‌ శాఖను సిఎం తనకు అప్పగించడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు.

 Srinivas Goud

తెలంగాణ వచ్చిన తరువాత అక్రమ రవాణా, కల్తీ మద్యం లాంటివి మాయమైపోయాయని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆంధ్ర పాలకులు గీతకార్మికులను నిర్లక్ష్యం చేశారని..తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికులకు పెద్ద పీట వేయడమే కాకుండా పలువురికి ఉపాధి కూడా కల్పించారని చెప్పారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలే మారిపోతాయాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 16లోక్ సభ స్ధానాలు గెలిచి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. బహుజన ప్రజల కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

(కేసీఆర్ క్యాబినెట్లో ఆ ఇద్దరూ మహిళా మంత్రులు వీరేనా) https://goo.gl/MEkVZK

- Advertisement -