నీటికి ఒక గుణం ఉంది. దాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారానికి అనుగుణంగా మారిపోతుంది. కమల్‌హాసన్ కూడా అంతే. సినిమా చూసే ప్రేక్షకుడికి వెండితెరపై కమల్‌హాసన్ అస్సలు కనిపించరు. కేవలం ఆయన చేసే పాత్ర మాత్రమే కన్పిస్తుంది. అందరూ అన్ని పాత్రలూ చేయలేరు. కమల్ అన్ని పాత్రలూ నటించకుండా ఉండలేరు. . నృత్య దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, రచయితగా, నిర్మాతగా..ఇలా చెప్పడం కంటే ‘సకల కళావల్లభుడు’ అని ఒక్క ముక్కలో చెప్పేస్తే బాగుంటుందేమో. అందుకే కమల్ అభిమానులకు ‘లోకనాయకుడు’ అయ్యారు. కమల్‌హాసన్ తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు. తండ్రి శ్రీనివాసన్ న్యాయవాది. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. కుటుంబంలో అందరికంటే కమల్ చిన్నవాడు. తన స్నేహితుడి గుర్తుగా తన పిల్లల పేర్లు చివరన హాసన్ అని పెట్టారు కమల్ తండ్రి. కమల్ ను చిన్నగా ఉన్నప్పుడు
‘కలత్తూర్ కన్నమ్మ’ చిత్రంలో బాలనటుడిగా ఎంపిక చేశారు. బాలనటుడిగా తొలి చిత్రానికి కమల్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.2వేలు. అప్పట్లో అదో సెన్సేషన్.
కుటుంబంలో అందరూ విద్యావంతులైనప్పటికీ చిన్నప్పటి నుంచి కమల్‌కు చదువుపై ఆసక్తిలేదట. దీంతో హైస్కూల్ లోనే చదువుకు స్వస్తి పలికి భరతనాట్యం నేర్చుకున్నాడు. అదే కమల్‌ను ఓ రకంగా సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భరతనాట్యంపై పట్టు ఉండటంతో సినీ నృత్య దర్శకుడు తంగప్ప మాస్టర్ వద్ద సహాయకుడిగా చేరారు. అప్పట్లో తంగప్ప మాస్టర్ ఎక్కువగా తెలుగు చిత్రాలకు నృత్య దర్శకత్వం చేసేవారు. ఆయనతో కలిసి కమల్ తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రానికి నృత్యాలు సమకూర్చారు.ఈ చిత్రానికి కమల్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.250. అలా అప్పటి నుంచి అటు తమిళ, ఇటు తెలుగు చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేశారు.
ఈ నేపథ్యంలో కమల్ స్నేహితుడు ఆర్సీ సత్యన్ ‘నీలో రచయిత ఉన్నాడని’ చెప్పడంతో… కమల్ నవ్వుతూ ‘హైస్కూల్ చదువు కూడా పాస్ కాలేదు నేను రచయిత ఏమిటి’ అన్నారట. అలా ఆర్సీ సత్యన్ ప్రోత్సాహంతోనే తొలిసారి స్క్రీన్‌ప్లే రాశానని చెబుతారు కమల్. ఇక నటుడిగా మాత్రం కమల్‌కు జన్మనిచ్చింది బాలచందర్. కమల్ ఆయనను తండ్రిగా భావిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వెళితే నటుడిగా ఎంపిక చేశారు. దర్శకుడివి ఎప్పుడైనా అవ్వొచ్చని ముందు నటుడివికా అన్నారట. అలా బాలచందర్ దర్శకత్వంలో ‘అరంగ్రేటం’ సినిమాలో నటించారు. అలా ఆయనతో దాదాపు 35 సినిమాలకుపై పైగా చేశారు. ‘నాయగన్’ చిత్రం వరకు ప్రతీ విషయంలో బాలచందర్ సపోర్ట్ ఉండేదని చెబుతారు కమల్
నటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించాక కమల్ ఒకే రకమైన సినిమాలకు పరిమితం కాలేదు. అలా చేస్తే ఆయన కమల్‌హాసన్ ఎందుకవుతారు. ప్రతీ సినిమాలో తన పాత్ర, ఆహార్యంలో ప్రత్యేకత ఉండేలా చూసుకునేవారు. అందుకు తగిన విధంగానే కథలను ఎంపిక చేసుకునేవారు. భారతీయ చిత్ర పరిశ్రమలో కమల్‌హాసన్ చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. 16ఏళ్ల కుర్రవాడి దగ్గరి నుంచి 60ఏళ్ల ముసలివాడి వరకు.. ఆయన చేయని పాత్రంటూ లేదు. తమిళ, తెలుగు భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించారు కమల్. అయితే తమిళంలో నటించిన చిత్రాల కన్నా తెలుగులో నటించిన చిత్రాలే ఎక్కువశాతం విజయం సాధించాయి. ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం కమల్‌కు అస్సలు ఇష్టం ఉండదు. వైవిధ్యం కోసం పరితపించే ఆయన ప్రతీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పాత్రకోసం తన శరీరాన్ని ఎంతగా హింసించుకునేందుకుకైనా వెనుకాడరు. కథానుసారం పాత్ర కోసం ఎంత కష్టపడతారో.. ఆయన చేసిన చిత్రాలు కూడా అంతే వార్తల్లో నిలుస్తాయి.
కమల్‌హాసన్‌కు నటనకు ఫిదా కానీ అవార్డు అంటూ లేదు. చిన్నతనంలోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లోనే ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇక 2014లో ‘పద్మ భూషణ్’ ఇచ్చి గౌరవించింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్స్ ఆర్ట్స్ దెస్‌లెటర్స్’ పురస్కారాన్ని అందించింది. ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు కొదవ లేదు. ఫిల్మ్‌ఫేర్‌కు ఆరుసార్లు నామినేట్ కాగా రెండు సార్లు అవార్డు దక్కింది. ఇక ఫిల్మ్‌ఫేర్ సౌత్ విభాగంలో 17సార్లు అవార్డు గెలుచుకున్నారు. ‘హేరామ్’ చిత్రం తర్వాత ఆయనే స్వయంగా ఫిల్మ్‌ఫేర్ ఆర్గనైజేషన్‌కు లేఖరాసి తనని ఇక నుంచి ఆ అవార్డుకు నామినేట్ చేయవద్దని కోరారట. ఎనిమిది తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, మూడు నంది అవార్డులు కమల్ సొంతం అయ్యాయి. మనిషిలోనే దేవుడు.. ఇదే కమల్ సిద్ధాంతం సాటి మనిషిలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతారు కమల్. తనని తాను హేతువాదిగా చెప్పుకొనే ఆయన సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. అభిమాన సంఘాల ద్వారా ఐ డొనేషన్, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సినిమా పరంగా కమల్ కెరీర్‌లో ఎన్నిగొప్పగొప్ప సినిమాలు,,నటనలు ఉన్నాయో,,ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుగులు ఉన్నాయి. మొదట కమల్ వాణీ గణపతి అనే నృత్యకళాకారిణిని వివాహామాడాడు.మనస్పర్థాల వల్ల మొదటి భార్యకు విడాకులు ఇచ్చి,,బాలీవుడ్ నటి సరికాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు,,,శృతి హాసన్, అక్షర్ హాసన్. వివాదాల వల్ల రెండో భార్య సరికాకు కూడా గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాది హీరోయిన్ గౌతమితో దాదాపు 15 ఏళ్లపాటు సహాజీవనం చేశాడు. అయితే రీసెంట్ ఈ బంధం కూడా తెగదెంపులు చేసుకుంది. కమల్ హాసన్ నుంచి,,,గౌతమి విడిపోయింది.
బరువెక్కిన గుండెతో కమల్ నుంచి విడిపోతున్నానని గౌతమి ప్రకటించింది. దీంతో కమల్ హాసన్ మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాడు. గొడవల వల్లే విడిపోయారా అనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై కమల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇలా కమల్ విషయంలో కొన్ని మాయని మచ్చగ మిలిగిపోయాయి. ప్రస్తుతం కమల్ శాభాస్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. దీంతో కూతురు శృతి కూడా కీలకపాత్ర పోషిస్తోంది. కమల్‌హాసన్ 62వ పుట్టినరోజు సందర్బంగా కూతురు శృతికి కమల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించొద్దని కమల్ తన అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సూచన మేరకు ఫ్యాన్స్ జన్మదిన వేడుకలను నిర్వహించలేదని కమల్ ప్రతినిధులు తెలిపారు.