మహేష్‌తో పటాస్ దర్శకుడు..కన్ఫామ్‌..!

253
Mahesh for Patas Director
- Advertisement -

భరత్ అనే నేను హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మహేష్ నెక్ట్స్ సినిమా ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. తొలుత మహేష్‌ తన తర్వాతి సుకుమార్‌తో చేస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది.

కళ్యాణ్‌ రామ్‌తో పటాస్‌ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించన అనిల్ రావిపూడితో మహేష్ సినిమా ఫైనల్‌ అయినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా సినిమాకు సంబంధించిన ప్రకటనతో పాటు నటీనటుల వివరాలను వెల్లడించనున్నారట.

వాస్తవానికి మహేష్‌ ..మ‌హ‌ర్షి త‌ర్వాత సుకుమార్‌తో చేసేందుకే మొగ్గుచూపాడు. సుకుమార్ రెడీ చేసిన కథ ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఉంటుంద‌ని వార్తలు వెలువడ్డాయి. అయితే పూర్తి కథ సిద్ధం కాకపోవడంతో అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకే మొగ్గుచూపాడట మహేష్‌. మొత్తంగా మహేష్‌తో అనిల్ తీసే సినిమాలో ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -