- Advertisement -
సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో చోరి జరిగింది. పెద్ద మొత్తంలో డబ్బు,నగలు చోరికి గురైనట్లు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు మోహన్ బాబు మేనేజర్. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే పనిమనుషులను విచారిస్తున్నారు పోలీసులు. దొంగలు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే కనుక్కుంటామని తెలిపారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మొన్న భాను ప్రియ అంతకుముందు చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చిరు ఇంట్లో పనిమనిషే దొంగతనం చేయగా మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -