సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా:ఎర్రబెల్లి

241
errabelli dayakar rao
- Advertisement -

సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలో 251 ఛాంబర్ లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, రూరల్ వాటర్ సప్లయిస్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు.స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లవుతున్నా గ్రామాలు అద్వాన్నంగా ఉన్నాయని చెప్పిన ఎర్రబెల్లి కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ రూపురేఖలు మారుతాయన్నారు.

కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖను తనకు కేసీఆర్ అప్పగించారని చెప్పిన ఎర్రబెల్లి అందరి మన్ననలు పొందుతానని చెప్పారు. 35 ఏళ్ల రాజకీయంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదన్నారు. చాలా మంది తనను మోసం చేశారన్న ఎర్రబెల్లి అడగకుండానే కేసీఆర్ మంత్రిపదవి ఇవ్వడమే కాదు కీలకశాఖను అప్పజెప్పరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,శంకర్ నాయక్ , పెద్ది సుదర్శన్ , గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్,కంచర్ల భూపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుండు సుదారాణి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -